సౌతాఫ్రికా జట్టు స్టార్ ఆల్ రౌండర్ డ్వైన్ ప్రిటోరియస్ అంతర్జాతీయ క్రికెట్ కు వీడ్కోలు చెప్పేశాడు. అన్ని ఫార్మాట్ల నుంచి తాను తప్పుకోవాలనుకుంటున్నట్లు.. తన నిర్ణయం తక్షణమే అమలులోకి రానుందని వెల్లడించాడు. ఇకపై ప్రపంచవ్యాప్తంగా జరిగే టి20 టోర్నీల్లో దేశంతో సంబంధం లేకుండా స్వేచ్ఛగా ఆడేందుకు ప్రయత్నిస్తానని పేర్కొన్నాడు. ఇది వరకు డుప్లెసిస్, ఎబి డివిలియర్స్ కూడా ఇంకా భవిష్యత్తు ఉండగానే జాతీయ జట్టుకు రిటైరై.. ప్రపంచ లీగ్స్ లో ఆడారు.