ఈ ఏడాది మార్చి 27 నుంచి జరగనున్న ఐపిఎల్ ఆతిధ్య హక్కుల్ని ఈసారి మా దేశానికి ఇవ్వాలని దక్షిణాఫ్రికా క్రికెట్ బోర్డ్ ప్రతిపాదనలు పంపింది. దీనిపై బిసిసిఐ ఇంకా నిర్ణయం తీసుకోలేదు. అయితే ఐపిఎల్ జట్ల యాజమాన్యాలు మాత్రం భారత్లోనే నిర్వహించాలని పట్టుబడుతున్న సంగతి తెలిసిందే. అయితే పరిస్థితులు అనుకూలించకపోతే యుఏఈలో కాకుండా దక్షిణాఫ్రికాలో ఈ మెగా టోర్ని నిర్వహించాలని సీఎస్ఎ బోర్డ్ కోరింది. యూఏఈ కంటే చౌకగా ఇక్కడ మ్యాచులు నిర్వహించుకోవచ్చని పేర్కొంది.