బాక్సింగ్​ డే టెస్ట్​: చెలరేగిస గ్రీన్​.. సౌతాఫ్రికా 189 ఆలౌట్​

By udayam on December 26th / 10:11 am IST

ఇటీవల ఐపిఎల్​ వేలంలో రెండో అత్యధిక ధర పలికిన ప్లేయర్​ గా రికార్డులకెక్కిన ఆసీస్​ పేసర్​ కేమరూన్​ గ్రీన్​ ఈరోజు నుంచి సౌతాఫ్రికాతో మొదలైన బాక్సింగ్​ డే టెస్ట్​ లో చెలరేగిపోయాడు. ఏకంగా 5 వికెట్లు తీసి సఫారీల భరతం పట్టిన అతడు ఆ జట్టును కేవలం 189 పరుగులకే కట్టడి చేశాడు. మిచెల్​ స్టార్క్​ 2 వికెట్లతో రాణించిన ఈ మ్యాచ్​ లో సఫారీ బ్యాటర్లలో జాన్​ సెన్​ 59, కైల్​ వెరీనె 52 పరుగులతో రాణించారు. ఆపై బ్యాటింగ్​ కు దిగిన ఆసీస్​ 45 పరుగులకు ఒక వికెట్​ కోల్పోయి తొలి రోజు ఆటను ముగించింది.

ట్యాగ్స్​