ఎస్​పి బాలు విగ్రహాన్ని తొలగించిన గుంటూరు కార్పొరేషన్​

By udayam on October 4th / 7:08 am IST

గుంటూరులో ప్రముఖ గాయకుడు ఎస్పీ బాల సుబ్రహ్మణ్యం విగ్రహం తొలగింపు ఇప్పుడు వివాదస్పదంగా మారింది. గుంటూరులోని మదర్ థెరీసా సెంటర్ లో ఈ విగ్రహం ఉంది. అయితే, మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు అనుమతి లేదన్న కారణంతో ఎస్పీ బాలు విగ్రహాన్ని తొలగించారు. ఈ ఘటనతో కార్పొరేషన్‌ అధికారులపై కళాకారులు ఆగ్రహం వ్యక్తం చేశారు. కళా దర్బార్ సంస్థ అధ్యక్షుడు పొత్తూరు రంగారావు స్పందిస్తూ, మహాగాయకుడి విగ్రహం పట్ల వ్యవహరించే తీరు ఇదేనా? అని ప్రశ్నించారు. గుంటూరులో 200కి పైగా అనుమతి లేని విగ్రహాలు ఉన్నాయని, బాలు విగ్రహాన్ని ఎందుకు తొలగించారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

ట్యాగ్స్​