రైతులకు సంకెళ్లు వేసిన పోలీసుల సస్పెన్షన్

By udayam on October 28th / 10:15 am IST

గుంటూరు: రైతులకు బేడీలు వేయడంపై గుంటూరు ఎస్పీ విశాల్ గున్ని సీరియస్ అవుతూ ఆరుగురు ఎస్కార్ట్ హెడ్ కానిస్టేబుళ్లను సప్పెండ్ చేశారు. దీంతో పాటు ఆర్ఎస్ఐ, ఆర్ఐలకు చార్జ్ మెమో ఇచ్చారు.

అంతే కాకుండా అడిషనల్ ఎస్పీతో విచారణ కమిటీని నియమించారు. ఆందోళన చేస్తున్న మంగళగిరి మండలం, కృష్ణాయపాలెంకు చెందిన రాజధాని రైతులను సంతకాలు పెట్టించి పంపుతామని స్టేషన్ కి పిలిచి.. అరెస్టు చేసి నవంబర్ 7 వరకూ రిమాండ్ విధించడంతో కరోనా పరీక్షలు చేసి, జైలుకు తరలించారు.

అయితే ఈ అంశంలో రైతులకు సంకెళ్లు వేయడంపై అమరావతి పరిరక్షణ సమితి, టీడీపీ నేతలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అలాగే ఈ ఘటనపై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్న నేపథ్యంలో ఎస్పీ విశాల్ గున్ని చర్యలకు దిగారు.

రైతులకు బేడీలు వేసి.. జిల్లా జైలుకు తరలించేందుకు ఎస్కార్ట్‌గా వచ్చిన ఆరుగురు హెడ్ కానిస్టేబుళ్లను సప్పెండ్ చేస్తూ.. ఛార్జి మెమో జారీచేశారు.