నింగిలోకి నలుగురు వ్యోమగాముల్ని పంపిన స్పేస్​ ఎక్స్​

By udayam on November 16th / 3:31 pm IST

ప్రఖ్యాత రాకెట్​ కంపెనీ స్పేస్​ ఎక్స్​ అమెరికాకు చెందిన నలుగురు నాసా వ్యోమగాముల్ని అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి పంపించింది. ఫ్లోరిడాలోని కేప్​ కార్నివాల్​ నుంచి ప్రయోగించిన ఫాల్కన్​ 9 రాకెట్​ ద్వారా వీరు నింగిలోకి ప్రయాణమయ్యారు.

ఐఎస్​ఎస్​లోకి వ్యోమగాముల్ని పంపడానికి ఇప్పటి దాకా రష్యాపై ఆధారపడిన నాసా.. ఈ తాజా ప్రయోగం విజయవంతం కావడంతో ఇకపై ప్రైవేట్​ కంపెనీ అయిన స్పేస్​ ఎక్స్​ను ఎంచుకునే అవకాశాలు మెరుగయ్యాయి.

ఇప్పటికే దీనిపై నాసా, స్పేస్​ ఎక్స్​లు కలిసి పది సంవత్సరాలు ప్రయత్నాలు చేస్తున్నాయి. మొత్తం ఆటోమేటిక్​ టెక్నాలజీతో తయారైన ఈ స్పేస్​ ఎక్స్​ ట్రిప్​ దాదాపు 27 గంటల ప్రయాణం అనంతరం వీరు భూమికి 250 మైళ్ళ ఎత్తులో తిరుగుతున్న అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి అనుసంధానం కానున్నారు.

ఈ అనుసంధాన ప్రక్రియ అయిన డాకింగ్​ ను సైతం వ్యోమగాముల ప్రమేయం లేకుండా ఫుల్లీ ఆటోమేటిక్​గా పూర్తయ్యేలా ఈ మిషన్​ ను నాసా, స్పేస్​ఎక్స్​లు సిద్ధం చేశాయి.