తెలంగాణకు కొత్త సీఎస్​ గా రామకృష్ణారావు!

By udayam on January 11th / 5:07 am IST

తెలంగాణ రాష్ట్రానికి కొత్త చీఫ్​ సెక్రటరీగా ఐఎఎస్​ రామకృష్ణారావు నియమితులయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఆయన తో పాటు శాంతి కుమారి, రజత్​ కుమార్​, అరవింద్​ కుమార్​ పేర్లను కూడా సిఎం కేసీఆర్​ పరిశీలిస్తున్నట్లు సమాచారం. తెలంగాణ వచ్చినప్పటి నుంచీ ఆర్థిక శాఖను రామకృష్ణా రావే చూస్తున్నారు. ఆయన కేసీఆర్‌కు సన్నిహితుడే కాకుండా, సీనియర్ల జాబితాలో ఉన్న ఒకే ఒక్క తెలంగాణ వ్యక్తి కూడా. దీంతో సహజంగానే ఆయనకే సీఎస్​ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ప్రస్తుత సీఎస్​ సోమేశ్​ కుమార్​, ఆంధ్రప్రదేశ్​ విభజన సమయంలో కేంద్రం ఏపీకి బదిలీ చేసినా వెళ్ళకుండా క్యాట్ కి వెళ్ళి తెలంగాణలోనే ఉండేలా ఆదేశాలు తెచ్చుకున్నారు. అయితే క్యాట్​ నిర్ణయాన్ని హైకోర్ట్​ కొట్టేయడంతో సోమేష్​ ఇప్పుడు ఏపీకి వెళ్​ళక తప్పట్లేదు.

ట్యాగ్స్​