పక్షిని గుద్దిన స్పైస్​జెట్​ విమానం

By udayam on May 10th / 6:49 am IST

బెలగావి నుంచి ఢిల్లీ వెళ్తున్న స్పైస్​ జెట్​ విమానం పక్షిని గుద్దిన ఘటన సోమవారం చోటు చేసుకుంది. ఈ ప్రమదంలో విమానం రెక్కలు దెబ్బతిన్నట్లు తెలుస్తోంది. అయితే విమానాన్ని ఢిల్లీలో క్షేమంగా ల్యాండ్​ చేశారు. 187 మంది ప్రయాణికులతో వెళ్తున్న బోయింగ్​ 737–8 మ్యాక్స్​ విమానం కర్ణాటకలోని బెలగావి నుంచి వెళ్తున్న సమయంలో పక్షిని ఢీకొట్టిందని స్పైస్​జెట్​ ప్రతినిధులు ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఢిల్లీలో దిగిన అనంతరం మరమ్మత్తుల కోసం ఈ విమానాన్ని అక్కడే నిలిపివేశారు.

ట్యాగ్స్​