క్రికెట్​కు తిసారా పెరీరా గుడ్​బై

By udayam on May 3rd / 11:29 am IST

శ్రీలంక ఆల్​రౌండర్​, ఆ జట్టు మాజీ కెప్టెన్​ తిసారా పెరీరా ఈరోజు అంతర్జాతీయ క్రికెట్​కు వీడ్కోలు చెప్పేశాడు. 32 ఏళ్ళ వయసులోనే అతడు క్రికెట్​కు గుడ్​బై చెప్పడంతో అతడి అభిమానులు నిర్ణయాన్ని మార్చుకోవాలని సోషల్​ మీడియాలో అతడ్ని కోరుతున్నారు. కెరీర్​లో శ్రీలంక తరపున 6 టెస్టుల్లో 203 రన్స్​, 11 వికెట్లు, 166 వన్డేల్లో 2338 రన్స్​ 175 వికెట్లు, 84 టి20ల్లో 1204 రన్స్, 51 వికెట్లు తీశాడు. ఐపిఎల్​లో కూడా 2010–16 వరకూ 37 మ్యాచులు ఆడిన అతడు 422 రన్స్​తో పాటు 31 వికెట్లు తీశాడు.

ట్యాగ్స్​