శ్రీలంక చేతిలో చిత్తు..

By udayam on May 27th / 11:36 am IST

బంగ్లాదేశ్​తో జరుగుతున్న 2 మ్యాచ్​ల టెస్ట్​ సిరీస్​ను శ్రీలంక దక్కించుకుంది. నిర్ణయాత్మక చివరి టెస్ట్​లో 10 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్​ చేసిన బంగ్లా 365 పరుగులు చేయగా.. దానికి జవాబుగా శ్రీలంక 506 పరుగులు చేసింది. ఆపై బంగ్లా 2వ ఇన్నింగ్స్​లో 169 పరుగులకు ఆలౌట్​ కాగా.. 29 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన శ్రీలంక వికెట్​ కోల్పోకుండా లక్ష్యాన్ని ఛేధించింది. 344 పరుగులు చేసిన మాథ్యూస్​ మ్యాన్​ ఆఫ్​ ది సిరీస్​గా ఎన్నికయ్యాడు.

ట్యాగ్స్​