పరుగులు ఆపలేక.. ఆపై ఛేదించలేక: 2వ టి20 లో ఓడిన భారత్​..

By udayam on January 6th / 5:18 am IST

ముందుగా బ్యాటర్లకు అనుకూలించే పిచ్​ పై టాస్​ నెగ్గి కూడా బౌలింగ్​ తీసుకున్న కెప్టెన్​ పాండ్య నిర్ణయం నుంచి నిన్నటి మ్యాచ్​ లో భారత్​ కు అన్నీ ప్రతికూలాంశాలే. ఫాంలో ఉన్న అర్షదీప్​ 5 నోబాల్స్​ వేయడం.. తొలి మ్యాచ్​ హీరో శివం మావి.. ఈ మ్యాచ్​ లో ఒక్క వికెట్​ కూడా తీయకుండా 53 పరుగులు ఇవ్వడానికి తోడు.. ఫీల్డింగ్ వైఫల్యాలు సైతం భారత్​ ను దెబ్బతీశాయి. దీంతో 2వ టి20లో భారత్​ ఓటమి పాలైంది. ముందుగా శ్రీలంక జట్టు 206 పరుగులు చేస్తే భారత్​ 190 పరుగులు మాత్రమే చేసింది. అక్షర్​ పటేల్​ 61 పరుగులతో ఆదుకునే ప్రయత్నం చేసినా ఫలితం దక్కలేదు.

ట్యాగ్స్​