చమిక కరుణరత్నేపై ఏడాదిపాటు నిషేధం

By udayam on November 24th / 10:41 am IST

శ్రీలంక క్రికెట్ బోర్డ్ సంచలన నిర్ణయం తీసుకుంది. శ్రీలంక ఆల్ రౌండర్ చమిక కరుణరత్నపై ఏడాది పాటు నిషేధం విధించింది. ప్రస్తుతం అతని ఫాం జట్టుకు అవసరం అయినప్పటికీ కరుణరత్నే చేసిన ఓ తప్పు అతనిపై నిషేధం విధించేలా చేసింది. ఆస్ట్రేలియాలో జరిగిన టీ20 వరల్డ్ కప్ లో లంక బోర్డ్, ప్లేయర్లకు మధ్య ఉన్న అగ్రిమెంట్లను ఉల్లంఘించిన ఈ ప్లేయర్​.. క్యాసినోలకు వెళ్ళడమే అతనిపై నిషేధం విధించేలా చేసింది. ఈ ఘటనపై శ్రీలంక క్రికెట్​ బోర్డ్​ నియమించిన ముగ్గురు సభ్యుల కమిటీ ముందు కరుణ రత్నే తన తప్పును ఒప్పుకున్నాడు. దీంతో అతడిపై ఏడాది పాటు నిషేధం, రూ.4 లక్షల జరిమానా విధించారు.

ట్యాగ్స్​