శ్రీలంకలో చెలరేగిన సివిల్ వార్ తీవ్ర హింసాత్మకంగా మారింది. ఆ దేశ మాజీ ప్రధాని మహీంద రాజపక్స ఇంటికి నిరసనకారులు నిప్పుపెట్టారు. ప్రధాని మద్దతు దారులు శాంతియుతంగా నిరసనలు చేస్తున్న వారిపై దాడికి దిగడంతో నిరసనకారుల ఆగ్రహం కట్టలు తెచ్చుకుంది. రాజపక్స ఇంటితో పాటు ఐదుగురు ఎంపీల ఇళ్ళను సైతం నిరసనకారులు తగులబెట్టారు. దేశవ్యాప్తంగా కర్ఫ్యూ అమలులో ఉన్నప్పటికీ ఇప్పటి వరకూ జరిగిన అల్లర్లలో 190 మందికి పైగా గాయపడ్డారు. ఒక ఎంపితో సహా 5 గురు మరణించారు.