ఎమెర్జెన్సీ ప్రకటించిన గొటబాయ

By udayam on May 7th / 5:35 am IST

ద్వీప దేశం శ్రీలంకలో ప్రభుత్వ వ్యతిరేక నిరసనలు తీవ్రమైన వేళ ఆ దేశ అధ్యక్షుడు గొటబాయ రాజపక్స ఎమెర్జెన్సీ ప్రకటించారు. దీంతో ఆ దేశం 5 వారాల వ్యవధిలో రెండుసార్లు సైన్యం ఆధీనంలోకి వెళ్ళినట్లయింది. శుక్రవారం ఆ దేశంలోని ట్రేడ్​ యూనియన్లు అధ్యక్షుడి రాజీనామాను డిమాండ్​ చేస్తూ.. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసనలు తీవ్రం చేయడంతో అక్కడి స్కూళ్ళు, ప్రభుత్వ, ప్రైవేటు కార్యాలయాలు మూతబడ్డాయి. దీంతో గొటబాయ రాజపక్స ఎమెర్జెన్సీని డిక్లేర్​ చేశారు.

ట్యాగ్స్​