శ్రీలంకలో ప్రభుత్వ వ్యతిరేక నిరసనలు తీవ్రమైన నేపధ్యంలో అక్కడి ప్రభుత్వం సంచలన ప్రకటన చేసింది. నిరసనకారులు కనిపిస్తే కాల్చి చంపాలని ఆదేశాలు జారీ చేసింది. ప్రభుత్వ ఆస్తులను ధ్వంసం చేసేవారిని, ప్రజల ప్రాణాలకు హాని కలిగించే వారు ఎవరైనా ఉపేక్షించేది లేదని ఆ దేశ రక్షణ మంత్రిత్వ శాఖ తన ఆదేశాల్లో పేర్కొంది. ఇప్పటికే శాంతియుత నిరసనకారులపై దాడికి దిగిన ప్రభుత్వం.. ఈ నిర్ణయంతో మరింత ప్రజాగ్రహాన్ని చవి చూడక తప్పదు.