శ్రీలంక ప్రధాని మహింద రాజపక్స ఆ దేశ ప్రజల నిరసనలకు తలొంచక తప్పలేదు. ప్రధాని పదవిని వదిలేస్తానని ఇప్పటికే ప్రకటించిన ఆయన ఈరోజు రాజీనామా చేసేశారు. తన రాజీనామా ప్రతిని అధ్యక్షుడు గొటబాయ రాజపక్సకు పంపించారు. ఈరోజు రాజపక్స అనుచరులకు, ప్రభుత్వ వ్యతిరేక వర్గాలకు ఆ దేశ రాజధాని కొలంబోలో తీవ్ర స్థాయిలో గొడవలు జరిగిన నేపధ్యంలో ఆయన రాజీనామా చేయక తప్పలేదు. దేశాన్ని తీవ్ర ఆర్ధిక సంక్షోభం వైపు నడిపించిన ఆయనకు వ్యతిరేకంగా ప్రజలు నెల రోజులుగా నిరసిస్తున్నారు.