శ్రీలంక కొత్త ప్రధాని రణిల్ విక్రమ సింఘే ఆ దేశ ప్రజలు నిరసనలను విడనాడి శాంతియుతంగా ఉండాలని పిలుపునిచ్చారు. దేశంలో ప్రజలందరూ మూడు పూటలా తినేలా చూస్తానని ఆయన హామీ ఇచ్చారు. ఆర్ధిక గడ్డు స్థితి నుంచి బయట పడేందుకు చిరకాల స్నేహితులు భారత్, జపాన్ దేశాల సాయం కోరానని ఆయన చెప్పారు. ‘వారు శాంతిస్తేనే నేను పనిచేయగలుగతా. పరిస్థితులు మరింత దిగజారొచ్చు. కానీ అవన్నీ చక్కబడతాయి. అలాంటి దేశాన్ని నేను నిర్మించగలను’ అని చెప్పుకొచ్చారు.