నువ్వు శ్రీదేవైతే.. వాల్తేరు వీరయ్య నుంచి రెండో సింగిల్​

By udayam on December 20th / 4:48 am IST

వాల్తేరు వీరయ్య మూవీ లోని నువ్వు శ్రీదేవైతే .. నేను చిరంజీవి అంటూ సాగే సాంగ్ ను మేకర్స్ రిలీజ్ చేసారు. గాడ్ ఫాదర్ తో మెగా హిట్ అందుకున్న మెగా స్టార్ చిరంజీవి..ప్రస్తుతం వాల్తేర్ వీరయ్య గా సంక్రాంతి సందర్బంగా జనవరి 13 న ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. బాబీ(కేఎస్ రవీంద్ర) డైరెక్ట్ చేస్తున్న ఈ మూవీ లో చిరంజీవి కి జోడిగా శృతి హాసన్ నటిస్తుండగా, రవితేజ కీలక పాత్రలో కనిపించనున్నాడు. కేథరిన్ థ్రెసా, సముద్రఖని, బాబీ సింహా, బిజు మీనన్ ఇతర పాత్రలు పోషిస్తున్నారు. ఈ సినిమాకి దేవిశ్రీ ప్రసాద్ సంగీతాన్ని సమకూరుస్తున్నాడు.

ట్యాగ్స్​