ఆర్ఆర్ఆర్ మూవీకి ఏదో ఒక విభాగంలో ఆస్కార్ పట్టేయాలన్న కసితో ఉన్న రాజమౌళి హాలీవుడ్ మీడియాకు ఇస్తున్న ఇంటర్వ్యూల్లో ఈ మూవీకి సీక్వెల్ ప్లాన్ చేస్తున్నట్లు చెప్పారు. వెరైటీ పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో తన తండ్రి విజయేంద్ర ప్రసాద్ ‘ఆర్ఆర్ఆర్’ సీక్వెల్ కు కథను సిద్ధం చేస్తున్నారని పేర్కొన్నాడు. ఆర్ఆర్ఆర్ మూవీకి ఇటీవలే రెండు గోల్డెన్ గ్లోబ్ నామినేషన్ తో పాటు ఒక ఆస్కార్ నామినేషన్ దక్కిన సంగతి తెలిసిందే.