జక్కన్న: ఆస్కార్​ నా పనితనాన్ని మార్చదు

By udayam on September 20th / 6:43 am IST

తన తాజా చిత్రం ‘ఆర్​ఆర్​ఆర్​’కు ఆస్కార్​ అవార్డ్​ దక్కినా తన పనితనంపై అది ఎలాంటి ప్రభావం చూపదని జక్కన్న రాజమౌళి చెప్పారు. ఆర్​ఆర్​ఆర్​కు ఆస్కార్​ అవార్డ్​ పక్కా అంటూ పలు హాలీవుడ్​ మ్యాగజైన్స్​ రిపోర్ట్ చేస్తున్న నేపధ్యంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. రూ.1000 కోట్లకు పైగా వసూళ్ళు సాధించిన ఈ మూవీకి ప్రపంచవ్యాప్తంగా ఉన్న పలువురు క్రిటిక్స్​ నుంచి ప్రశంసలు దక్కాయి. దీంతో యాక్టర్స్​ రామ్​చరణ్​, ఎన్టీఆర్​లతో పాటు డైరెక్టర్​ రాజమౌళికి సైతం ఆస్కార్​ దక్కుతుందని వెరైటీ మ్యాగజైన్​ రిపోర్ట్​ చేసింది.

ట్యాగ్స్​