హాలీవుడ్ లో రోజుకో అవార్డును సొంతం చేసుకుంటున్న జక్కన్న రాజమౌళి మూవీ ఆర్ఆర్ఆర్ కు మరో ఘనత దక్కనుంది. హాలీవుడ్ క్రిటిక్స్ అసోసియేషన్ ఫిలిం అవార్డ్స్ లో ఈ మూవీకి నాలుగు నామినేషన్లు దక్కాయి. బెస్ట్ డైరెక్టర్, బెస్ట్ పిక్చర్, బెస్ట్ యాక్షన్ ఫిలిం, బెస్ట్ ఇంటర్నేషనల్ ఫిలిం విభాగాల్లో ఏకంగా నాలుగు నామినేషన్లను కొల్లగొట్టింది ఆర్ఆర్ఆర్. వీటి సాయంతో ఆస్కార్ ఎంట్రీ కోసం రాజమౌళి తీవ్రంగా శ్రమిస్తున్న విషయం తెలిసిందే.