రాష్ట్రంలో టెన్త్ పరీక్షా పత్రాలు లీక్ అవుతున్నాయన్న వార్తల్ని విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ ఖండించారు. సిసిటివి కెమెరాలను ఏర్పాటు చేసి మరీ టెన్త్ పరీక్షలను పకడ్బందీగా నిర్వహిస్తున్నామన్న ఆయన.. మాల్ ప్రాక్టీస్ చేసే విద్యార్థుల పట్ల కఠినంగా వ్యవహరిస్తామని తెలిపారు. టెన్త్ క్వశ్చన్ పేపర్లు లీక్ అవుతున్నాయని తెలుగుదేశం పార్టీనే రాద్దాంతం చేస్తోందని ఆయన తిప్పికొట్టారు. విద్యార్థులకు సాయం చేయడానికి చూసిన 38 మంది టీచర్లను సస్పెండ్ చేశామన్నారు.