బాలీవుడ్​ లో రీమేక్​ కానున్న లవ్ టుడే!

By udayam on December 21st / 6:49 am IST

కోమలి ఫేమ్ దర్శకుడు ప్రదీప్ రంగనాథన్ హీరోగా నటించిన ‘లవ్ టుడే’ సినిమా తమిళనాడు బాక్సాఫీస్ వద్ద సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. తెలుగులోనూ భారీగా సంపాదించిన ఈ మూవీ ఇప్పుడు బాలీవుడ్​ లో రీమేక్​ కు సిద్ధమైంది. స్టార్ హీరో వరుణ్ ధావన్ ఈ మూవీపై ఆశక్తి చూపుతున్నాడు. ఈ సినిమా బాలీవుడ్ రైట్స్ ని కొనుగోలు చేసేందుకు ప్లాన్ చేస్తున్నాడని, తన తండ్రి డేవిద్ ధావన్ దర్శకత్వం వహిస్తాడని సమాచారం. మరి ఈ ప్రాజెక్ట్ సెట్స్ పైకి వెళ్తుందో లేదో చూడాలి.

ట్యాగ్స్​