Ind vs Pak: ‘మోకా మోకా’ యాడ్​ మళ్ళీ వచ్చేసింది

By udayam on October 13th / 7:07 pm IST

భారత్​, పాక్​ జట్ల మధ్య మ్యాచ్​ అంటే టివిల్లో మార్మోగిపోయే యాడ్​ ‘మోకా మోకా’. ఈనెల 24 న మళ్ళీ దాయాది దేశాలు పోటీపడుతున్న నేపధ్​యంలో స్టార్ స్పోర్ట్స్​ ఈ ఐకానిక్​ యాడ్​ను మళ్ళీ తీసుకొచ్చింది. గత యాడ్​లో కనిపించిన పాక్​ అభిమానే ఈసారి యాడ్​లోనూ కనిపించాడు. ఈసారి బాబర్​, రిజ్వాన్​ వంటి ప్లేయర్లతో పాక్​ గతం కంటే బలంగా ఉందని అతడు చెప్పడం, దానికి భారత అభిమానులు వెటకారించడం ఇందులోనూ నవ్వులు పూయిస్తోంది. ఈ ఐకానిక్​ యాడ్​ను మీరింకా చూడకపోతే ఓ లుక్కేసేయండి మరి!