కేవైసి చేయకపోతే ఎకౌంట్​ ఫ్రీజ్​ : ఎస్​బిఐ

By udayam on May 3rd / 6:41 am IST

మే 31వ తేదీ నాటికి తమ బ్యాంకులోని ఖాతాదారులందరూ కేవైసి చేయించుకోవాలని ఎస్​బిఐ ట్వీట్​ చేసింది. లేని పక్షంలో ఆ అకౌంట్లన్నింటినీ ఫ్రీజ్​ చేసేస్తామని తెలిపింది. ఇప్పటికే ఇచ్చిన గడువు ముగిసినప్పటికీ కరోనా కారణంగా దానిని మరోసారి 30 రోజుల పాటు పొడిగిస్తున్నట్లు ఎస్​బిఐ వెల్లడించింది. ఎస్​బిఐ బ్యాంకుకు రాలేని వారు పోస్టు ద్వారా కానీ, ఈమెయిల్​ ద్వారా కానీ తమ కేవైసి వివరాలను బ్యాంకుకు పంపించవచ్చని సైతం తెలిపింది.

ట్యాగ్స్​