అతి పెద్ద ప్రభుత్వ రంగ బ్యాంక్ ఎస్బిఐ ఇంటర్నెట్ సేవలు దేశవ్యాప్తంగా నిలిచిపోయాయి. గురువారం మధ్యాహ్నం నుంచి పూర్తిగా స్తంభించిపోవడంతో వినియోగదారుల నుంచి ఫిర్యాదులు వెల్లువెత్తాయి. ఆన్లైన్ బ్యాంకింగ్, యుపిఐ ట్రాన్సాక్షన్లు, డెబిట్ కార్డ్ ట్రాన్సాక్షన్లు ఏవీ పనిచేయలేదు. ఏటిఎంలలో డెబిట్ కార్డ్లు సైతం పనిచేయలేదు. ఎస్బిఐకి చెందిన యోనో యాప్ లాగిన్, బ్యాలెన్స్ ఎంక్వైరీలు సైతం పనిచేయలేదు.