4:05 pm
Thursday, October 29, 2020

28°C
Vishakhapatnam, India

రీ ఓపెన్ అయిన స్టాట్యూ ఆఫ్ యూనిటీ… 2 weeks ago

అహ్మదాబాద్ : గుజరాత్ లో ప్రతిష్టాత్మక స్టాట్యూ ఆఫ్ యూనిటీని శనివారం పునః ప్రారంభించారు. అన్ లాక్ లో భాగంగా సందర్శకులను అనుమతించాలని నిర్ణయించడంతో రీ ఓపెన్ అయింది. కరోనా వ్యాప్తి వల్ల గత ఏడు నెలల తర్వాత సందర్శకుల కోసం విగ్రహాన్ని తెరవడంతో పర్యాటకులు చూసేందుకు బారులు తీరారు. రోజుకు 2,500 మంది సందర్శకులను మాత్రమే విగ్రహం చూసేందుకు అనుమతించాలని నిర్ణయించారు.

ఇక సర్దార్ వల్లభాయ్ పటేల్ గ్యాలరీ లోపల కేవలం 500 మంది పర్యాటకులనే అనుమతిస్తారు. ప్రపంచంలోనే అతిపెద్ద ఎత్తైన విగ్రహాన్ని చూసేందుకు సందర్శకులు మాస్కులు ధరించడంతోపాటు సామాజిక దూరం పాటించాలని ఆదేశాలు జారీ చేశారు. ఈ విగ్రహాన్ని చూసేందుకు పర్యాటకులకు ఆన్ లైన్ లో టికెట్లు విక్రయిస్తారు.