చిలకలూరి పేట మండలంలోని యడ్లపాడు వద్ద ఉన్న ఎర్రకొండపై ఏసు ప్రభువు, మేరీ మాత విగ్రహాలను గుర్తు తెలియని ఆకతాయిలు ధ్వంసం చేశారు. మేరీ మాత మెడలో పసుపు కొమ్ములతో కట్టిన తాళిబొట్టును వేశారు. ఆదివారం దీనిని గమనించిన భక్తులు పెద్ద ఎత్తున ఎర్రకొండ వద్దకు వచ్చి స్థానికంగా తీవ్ర ఆందోళనకు దిగారు. నరసరావు పేట డిఎస్పీ భాస్కరరావు, చిలకలూరి పేట సీఐ ఎం.సుబ్బాబు, యడ్లపాడు ఎస్ఐ రాంబాబు ఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చారు.