రానున్న వర్షాకాలం నాటికి దేశంలో నిర్మాణ రంగం నెమ్మదించి ఉక్కు ధరల్లో భారీ తగ్గుదల నమోదవుతుందని క్రిసిల్ రేటింగ్ పేర్కొంది. ప్రస్తుతం టన్ను ఉక్కు ధర రూ.76,000 గా ఉండగా అది వచ్చే ఏడాది మార్చి నాటికి టన్నుకు రూ.60,000కరు పడిపోతుందని పేర్కొంది. రష్యా–ఉక్రెయిన్ యుద్ధం, కర్బన ఉద్గారాలు తగ్గించుకోవడం, ఉక్కు తయారీకి వినియోగించే ముడి పదార్థాల ధరలు పెరగడం వంటి కారణాలతో ప్రస్తుతం ఉక్కు ధరలు సామాన్యుడికి చుక్కలు చూపిస్తున్నాయని అభిప్రాయపడింది.