75 ఏళ్ళ పాకిస్థాన్ క్రికెట్ చరిత్రలో తొలిసారిగా ఆ జట్టు స్వదేశంలో వైట్ వాష్ కు గురైంది. ఇంగ్లాండ్ తో జరుగుతున్న టెస్ట్ సిరీస్ లో బాబర్ అజామ్ నేతృత్వంలోని పాక్ జట్టు 3–0 తో ఘోర ఓటమిని మూటగట్టుకుంది. 3వ టెస్ట్ 4వ రోజు ఆటలో 167 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఇంగ్లాండ్ కేవలం 2 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. పాకిస్తాన్ తొలి ఇన్నింగ్స్‌లో 304 పరుగులకు ఆలౌట్ అయ్యింది. ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్‌లో 354 పరుగులకు ఆలౌటైంది. ఆపై పాక్ రెండో ఇన్నింగ్స్ లో 216 పరుగులు చేసి ఇంగ్లాండ్ కు 167 పరుగుల లక్ష్యాన్ని విధించారు.