వందే భారత్​ ఎక్స్​ ప్రెస్​ పై రాళ్ళ దాడి

By udayam on January 3rd / 10:38 am IST

బెంగాల్​ లో కేవలం 4 రోజుల క్రితమే ప్రారంభమైన వందే భారత్​ ఎక్స్​ ప్రెస్​ పై కొందరు దుండగులు రాళ్ళ దాడికి పాల్పడ్డారు. హౌరా నుంచి ప్రతీ సోమవారం ప్రారంభమయ్యే ఈ ట్రైన్​ పై మల్దా లోని కుమర్​ గంజ్​ స్టేషన్​ వద్ద దాడి చేశారు. ఈ దాడిలో ట్రైన్​ లోని కోచ్​ నెం.సి13 అద్దాలు పగిలిపోయాయి. ఈ ట్రైన్​ ను డిసెంబర్​ 30న ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించారు. దేశంలో మొదలైన 7వ వందే భారత్​ ఎక్స్​ ప్రెస్​ ట్రైన్​ ఇది.

ట్యాగ్స్​