Vizag: విశాఖలో వందేభారత్​ రైలుపై రాళ్ళ దాడి

By udayam on January 12th / 6:53 am IST

ఈనెల 19న ప్రారంభం కానున్న వందేభారత్​ ఎక్స్​ ప్రెస్​ పై కొందరు ఆకతాయిలు రాళ్ళతో దాడి చేశారు. దీంతో రెండు భోగీల అద్దాలు బద్దలయ్యాయి. ట్రయల్ రన్ కోసం చెన్నై నుంచి విశాఖకు వచ్చిన రైలును మర్రిపాలెం యార్డుకు తీసుకెళ్తుండగా ఈ ఘటన జరిగింది. ఇది రాళ్ల దాడేనని వాల్తేరు రైల్వే డివిజన్ అధికారులు నిర్ధారించారు. మరోవైపు ఈ ఘటనపై డీఆర్ఎం అనూప్ సత్పతి విచారణకు ఆదేశించారు. సికింద్రాబాద్, విశాఖపట్నం నగరాల మధ్య పరుగులు పెట్టడానికి సూపర్ ఫాస్ట్ ఎక్స్ ప్రెస్ ‘వందే భారత్’ ఎక్స్ ప్రెస్ ను ఈనెల 19న ప్రధాని నరేంద్ర మోదీ వర్చువల్​ గా ప్రారంభించనున్నారు.

ట్యాగ్స్​