హోటళ్ళు, రెస్టారెంట్లలో బలవంతంగా వసూలు చేస్తున్న సర్వీస్ ఛార్జ్‌ను తక్షణమే ఆపేయాలని కన్జూమర్ అఫైర్స్ మంత్రిత్వ శాఖ ఆదేశాలు జారీ చేసింది. వినియోగదారులకు ఇచ్చే బిల్స్‌లో సర్వీస్ ఛార్జ్ అనేది పూర్తిగా అసంబద్దమైనదని తన ఆదేశాల్లో పేర్కొంది. రెస్టారెంట్లలో సర్వీస్ ఛార్జ్‌ను సర్వీస్ ట్యాక్స్ రూపంలో వసూళ్ళు చేయడం ఇకపై చట్టవిరుద్ధమని పేర్కొంది.