బంగాళాఖాతంలో ఏర్పడ్డ అసాని తుఫాన్ వచ్చే 24 గంటల్లో బలహీనపడనుందని వాతావరణ శాఖ అంచనా వేస్తోంది. దీని ప్రభావంతో ఇప్పటికే కోల్కతాతో పాటు ఒడిశా, ఎపిల్లో కొన్ని చోట్ల భారీ వర్షాలు కురుస్తున్నాయి. రేపు సాయంత్రానికి ఈ తుఫాన్ ఒడిశా లేదా ఆంధ్ర తీర ప్రాంతంలో తీరం దాటి ఆపై క్రమంగా బలహీనపడుతుందని పేర్కొంది. మంగళవారం, బుధవారాల్లో ఎపి, ఒడిశాలలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని పేర్కొంది. బీహార్, జార్ఖండ్, బెంగాల్, సిక్కింలలోనూ వర్షాలు కురవనున్నాయి.