తిరుమలకు 600 కిలోమీటర్లు నడిచిన కుక్క

By udayam on April 13th / 8:15 am IST

జంగారెడ్డి గూడెం నుంచి తిరుమల వరకూ పాదయాత్ర చేస్తున్న ప్రతాప్​ రెడ్డి అనే భక్తుడితో పాటు ఓ వీధి కుక్క సైతం 600 కిలోమీటర్లు నడిచింది. పశ్చిమ గోదావరి జిల్లాలోని మద్ది ఆంజనేయ స్వామి ఆలయం నుంచి ప్రారంభమైన ఈ పాదయాత్రలో ప్రతాప్​తో పాటు అతడి ఫ్రెండ్​ రవి, మరో రెండు వీధి కుక్కలు ప్రయాణం ప్రారంభించాయి. ఒకటి మాత్రం ప్రయాణాన్ని మధ్యలోనే వదిలేయగా మరోటి మాత్రం 600 కిలోమీటర్లు ప్రయాణించి వీరు పెట్టింది తింటూ నడిచింది. సహజంగానే మూగజీవాలంటే ఇష్టం ఉన్న ప్రతాప్​కు ఆ కుక్కను తిరిగి ఇంటికి తీసుకెళ్ళి పెంచుకుంటానని అతడిని కలిసిన విలేకరులకు తెలిపాడు.

ట్యాగ్స్​