తండ్రైన స్టువర్ట్​ బ్రాడ్​

By udayam on November 25th / 7:49 am IST

ఇంగ్లాండ్​ స్టార్​ పేసర్​ స్టువర్ట్​ బ్రాడ్​, అతడి ప్రేయసి మోలీ కింగ్​ లు పండంటి పాపకు జన్మనిచ్చారు. శుక్రవారం వాళ్ళ ఇన్​ స్టాగ్రామ్​ ఖాతాలో పాప ఫొటోను షేర్​ చేస్తూ తమ ఆనందాన్ని వ్యక్తం చేశారు. పాపకు అనబెల్లా బ్రాడ్​ గా పేరు పెట్టినట్లు వాళ్ళు వెల్లడించారు. ది శాటర్​ డేస్​ సింగర్​ ప్రోగ్రామ్ తో పాపులర్​ అయిన మోలీ కింగ్​ రేడియ్​ 1 ఛానల్​ లోనూ ప్రెజెంటర్​ గా పనిచేస్తున్నారు. 2012 నుంచి డేటింగ్​ లో ఉన్న ఈ జంట 2021 జనవరి 1న నిశ్చితార్ధం చేసుకున్నారు. పాప పుట్టిన కారణంతో పాకిస్థాన్​ తో జరిగే 3 మ్యాచ్​ ల టెస్ట్​ సిరీస్​ నుంచి బ్రాడ్​ తప్పుకున్నాడు.

ట్యాగ్స్​