దువ్వాడ : రైలు–ప్లాట్​ ఫాం మధ్య చిక్కుకున్న విద్యార్థిని

By udayam on December 7th / 6:08 am IST

విశాఖపట్టణం జిల్లా దువ్వాడ రైల్వే స్టేషన్‌లో ఓ ఎంసీఏ విద్యార్థిని ఫ్లాట్‌ఫాం-రైలు మధ్య ఇరుక్కుని నరకయాతన పడ్డ ఘటన ఈ ఉదయం చోటు చేసుకుంది. బయటకు రాలేక ఆమె దాదాపు 2 గంటల పాటు చిత్రవధ అనుభవించింది. అన్నవరానికి చెందిన 20 ఏళ్ల శశికళ దువ్వాడలోని ఓ కాలేజీలో ఎంసీఏ ఫస్టియర్ చదువుతోంది. రోజులానే రాయగడ ఎక్స్‌ప్రెస్ రైలులో దువ్వాడ చేరుకుంది. స్టేషన్‌లో దిగుతున్న సమయంలో ప్రమాదవశాత్తు ప్లాట్‌ఫామ్ కిందికి జారిపడింది. రైల్వే రెస్క్యూ సిబ్బంది అక్కడికి చేరుకుని యువతి ఇరుక్కుపోయిన చోట ప్లాట్‌ఫామ్‌ను బద్దలుగొట్టి ఆమెను రక్షించారు.

ట్యాగ్స్​