ఆఫ్ఘనిస్థాన్​ లో బాంబు పేలుళ్లు.. 12 మంది దుర్మరణం

By udayam on December 1st / 11:02 am IST

ఆఫ్గనిస్థాన్ తాలిబన్ల వశమయ్యాక అనేక దారుణాలు వెలుగుచూస్తున్నాయి. ఆత్మహుతి దాడులతో దేశం వణికిపోతుంది. కేవలం యువతను లక్ష్యంగా చేసుకుని ఈ దాడులకు పాల్పడుతున్నారు. తాజాగా ఐబక్‌ నగరంలోని ఒక మదరసాలో బుధవారం సంభవించిన పేలుళ్లలో 16 మంది ప్రాణాలు కోల్పోయారు. అనేక మంది తీవ్రంగా గాయపడ్డారు. ఈ విషయాన్ని స్థానికంగా వైద్యుడు ఒకరు మీడియాకి వెల్లడించారు. తమ ఆస్పత్రికి చికిత్సకి వచ్చిన వారిలో యువతే అత్యధికంగా ఉన్నారని చెప్పారు. ఇక మదరసాలో పేలుళ్లు జరిగినట్టుగా ప్రావిన్షియల్‌ అధికారి కూడా ధ్రువీకరించారు. ఈ దాడులకు పాల్పడింది ఎరనేది ఇంకా తెలియలేదు.

ట్యాగ్స్​