టెన్త్ పరీక్షలకు సిద్ధమవుతున్న కొందరు ఒడిశా విద్యార్థులు పుష్ప మూవీలోని శ్రీవల్లి సాంగ్‌కు డ్యాన్స్ చేసిన వీడియో వైరల్ కావడంతో ఆ స్కూల్ హెడ్మాస్టర్ సస్పెండ్ అయింది. ఈ డ్యాన్స్ వీడియోలో కొంత మంది గ్రూప్‌గా చేరి తమ మొబైల్‌ను స్కూల్లోని స్మార్ట్ స్క్రీన్కు కనెక్ట్ చేసి డ్యాన్సులు వేశారు. దీంతో ఆగ్రహించిన విద్యాశాఖ అధికారులు ప్రిన్సిపల్ సుజాత పాదీకి విధి నిర్వహణలో అలసత్వంగా ఉన్నందకు సస్పెండ్ చేశారు.