ఒకే తరగతి గదిలో ఒకే బ్లాక్ బోర్డ్‌పై ఇద్దరు టీచర్లు.. ఓ వైపు హిందీని, మరో వైపు ఉర్ధూను నేర్పుతున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. బీహార్‌లోని ఓ ప్రాథమిక ఉన్నత పాఠశాలలో ఒకేసారి రెండు సబ్జెక్టులను పిల్లలకు నేర్పించడంపై నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. టీచర్లు ఓ వైపు ‘ఇంత కష్టపడుతున్నా’ పిల్లలు మాత్రం వినడం లేదు. స్టూడెంట్స్ అల్లరి మధ్యే వారు నామ్ కే వాస్తే అన్నట్లు పాఠాలు చెప్పుకుపోతుండడం వీడియోలో కనిపిస్తోంది.
#WATCH | Bihar: Hindi & Urdu being taught on same blackboard in one classroom of a school in Katihar
Urdu Primary School was shifted to our school by Education Dept in 2017. Teachers teach both Hindi &Urdu in one classroom: Kumari Priyanka, Asst teacher of Adarsh Middle School pic.twitter.com/ZdkPE0j7tW
— ANI (@ANI) May 16, 2022