తమిళ సినీ ఇండస్ట్రీలో మరో విషాదం చోటు చేసుకుంది. విజయ్ సేతుపతి నటిస్తున్న కొత్త మూవీ విడుతలై షూటింగ్ లో 20 అడుగుల ఎత్తు నుంచి జారి పడి స్టంట్ మెన్ ఎస్.సురేష్ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. 54 ఏళ్ళ సురేష్ 30 ఏళ్ళుగా సినీ ఇండస్ట్రీలో స్టంట్ మెన్ గా పనిచేస్తున్నాడు. 20 అడుగుల ఎత్తు నుంచి దూకే సీన్ లో హీరోకి డూప్ గా చేస్తున్న సురేష్.. అతడి నడుముకు కట్టిన తాడు తెగిపోవడంతో అంత ఎత్తు నుంచి కింద పడ్డట్టు పోలీసులు తెలిపారు.