ఒకవైపు గత రెండు మూడు రోజులుగా నగరంలో చలి విజృంభణతో నగరవాసులు వణికిపోతుంటే.. మరోవైపు వర్షాలు హైదరాబాద్ నీ వదలడం లేదు. గురువారం అర్ధరాత్రి తర్వాత నగరం, చుట్టుపక్కల ప్రాంతాల్లో చిరు జల్లులు కురియగా, శుక్రవారం వేకువఝామునే మరోసారి చిరుజల్లుల నుంచి ఓ మోస్తరు దాకా వర్షం కురిసింది. బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, అమీర్‌పేట, పంజాగుట్ట, ఆర్టీసీ క్రాస్‌రోడ్, చింతల్, బాలానగర్, సుచిత్ర, కుత్బుల్లాపూర్, బేగంపేట. ఇంకా పలు ప్రాంతాల్లో వర్షం కురిసింది.