జనవరి 26న సుధీర్​ బాబు ‘హంట్​’

By udayam on December 31st / 4:40 am IST

‘ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి’ సినిమాతో ఈ ఏడాది ప్రేక్షకులను అలరించిన సుధీర్ బాబు తన నెక్స్ట్ మూవీ ‘హంట్’ రిలీజ్ డేట్ ను లాక్​ చేశాడు. జనవరి 26, 2023 నుంచి తన ‘హంట్’ ను మొదలెట్టనున్నాడు. చిత్ర శుక్లా హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాలో శ్రీకాంత్, భరత్ నివాస్ ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు. ఘిబ్రన్ సంగీతం అందిస్తున్నారు. కొత్తదర్శకుడు మహేష్ డైరెక్షన్లో యాక్షన్ థ్రిల్లర్ గా రూపొందుతున్న ఈ సినిమాను భవ్య క్రియేషన్స్ పతాకంపై వి ఆనంద్ ప్రసాద్ నిర్మిస్తున్నారు.

ట్యాగ్స్​