పిచాయ్​: యావత్​ ప్రపంచం వెతికింది ఈ మ్యాచ్​ కోసమేనా

By udayam on December 19th / 12:23 pm IST

గత పాతికేళ్లలో మరే అంశం కోసం వెదకనంతగా, ప్రజలు ఫిఫా వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్ కోసం సెర్చ్ చేశారని గూగుల్​ సీఈఓ సుందర్​ పిచాయ్​ ట్వీట్​ చేశారు. గత 25 ఏళ్లలో ఈ స్థాయిలో ఇంటర్నెట్ ట్రాఫిక్ ఎప్పుడూ నమోదు కాలేదని పిచాయ్ వెల్లడించారు. ఒకే ఒక్క అంశం కోసం యావత్ ప్రపంచం వెదికినట్టుగా ఉందని అభివర్ణించారు. ‘అర్జెంటీనా వర్సెస్ ఫ్రాన్స్’ అనే సెర్చ్ టర్మ్ తో డిసెంబరు 18వ తేదీన కోటి మందికి పైగా సెర్చ్ చేశారని గూగుల్ ట్రెండ్ (ఇండియా) డేటాలో వెల్లడైంది.

ట్యాగ్స్​