గుండెపోటుతో వారసుడు ఆర్ట్ డైరెక్టర్ మృతి

By udayam on January 6th / 11:22 am IST

వారసుడు మూవీ టీం విషాదం లో పడింది. వారసుడు చిత్రానికి ఆర్ట్ డైరెక్టర్ గా వర్క్ చేసిన సునీల్ బాబు గుండెపోటుతో మరణించారు. గుండెపోటు తో కేరళలోని ప్రవైట్ హాస్పటల్ లో చేరిన సునీల్ చికిత్స తీసుకుంటూ మరణించాడు. తమిళ్ హీరో విజయ్ – రష్మిక జంటగా వంశీ పైడిపల్లి డైరెక్షన్లో దిల్ రాజు నిర్మిస్తున్న పాన్ ఇండియా మూవీ వారసుడు (తమిళంలో వారిసు). సెన్సార్ స‌హా అన్నీ కార్య‌క్రమాల‌ను పూర్తి చేసుకుని ఈ సినిమా సంక్రాంతి సందర్భంగా జనవరి 11న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ప్రస్తుతం చిత్ర యూనిట్ ప్రమోషన్ కార్య క్రమాల్లో బిజీ గా ఉండగా..ఈ చిత్రానికి ఆర్ట్ డైరెక్టర్ గా వర్క్ చేసిన సునీల్ బాబు మరణం చిత్ర యూనిట్ ను విషాదం లో పడేసింది.

ట్యాగ్స్​