జూనియర్ ఆర్టిస్ట్ సునీత బోయ మరోసారి నిర్మాత బన్నీ వాసుకు వ్యతిరేకంగా గీతా ఆర్ట్స్ కార్యాలయం ముందు నిరసన వ్యక్తం చేసింది. బుధవారం రాత్రి నిర్మాణ సంస్థ కార్యాలయం గేటు బయట నగ్నంగా కూర్చుని తన నిరసనను వ్యక్తి చేసింది. దీనిపై జూబ్లీహిల్స్ మహిళా పోలీసులు స్పందించి ఆమె పై దుస్తులు కప్పి ఆమెకు నచ్చజెప్పి అక్కడి నుంచి పంపించారు. ఈ సందర్భంగా సునీత మాట్లాడుతూ తనకు నెలవారీ ఖర్చులకు కొంత ఇబ్బందిగా ఉందని పోలీసుల దృష్టికి తీసుకెళ్లింది. బన్నీ వాసు ప్రస్తుతం ఇతర ప్రాంతంలో షూటింగులో ఉన్నాడని, వచ్చాక మాట్లాడతామని చెప్పిన పోలీసులు ఆమెకు కొన్ని డబ్బులు ఇచ్చి అక్కడి నుంచి పంపించారు.