రషీద్​ను వదిలేస్తున్న సన్​రైజర్స్​

By udayam on November 26th / 10:44 am IST

సన్​రైజర్స్​ హైదరాబాద్​లో కీలక ఆటగాడైన రషీద్​ ఖాన్​ను ఆ జట్టు మెగా వేలానికి వదిలేయాలని చూస్తోందని క్రిక్​బజ్​ వార్తను రాసింది. ఐపిఎల్​ రిటెన్షన్​ రూల్స్​ ప్రకారం 3 గురు దేశీయ, ఒక విదేశీ ఆటగాడ్ని మాత్రమే జట్లు రిటైన్​ చేసుకోవాల్సి ఉండగా కెప్టెన్​ విలియమ్సన్​ను రిటైన్​ చేసుకుని రషీద్​ను వేలానికి వదిలేయాలని ఆలోచిస్తోందట. దీంతో రషీద్​ మెగా వేలంలోకి రాక తప్పటం లేదు. ఒకవేళ అదే జరిగితే ఈ ఆఫ్ఘన్​ ప్లేయర్​ను దక్కించుకోవడానికి భారీ మొత్తంలో వెచ్చించడానికి ఫ్రాంఛైజీలు వెనకాడవు.

ట్యాగ్స్​