సన్​రైజర్స్​కు దెబ్బ మీద దెబ్బ

By udayam on September 24th / 11:24 am IST

ఐపిఎల్​లో సన్​రైజర్స్​కు ఈ సీజన్​ ఏదీ కలిసి రావడం లేదు. ఇప్పటికే స్టార్​ పేసర్​ నటరాజన్​కు కరోనా సోకడంతో ఐసోలేషన్​లోకి వెళ్ళగా ఇప్పుడు ఆ జట్టు స్టార్​ ఆటగాడు షెర్ఫాన్​ రూథర్​ఫోర్డ్​ ఇంటిముఖం పట్టాడు. రూథర్​ఫోర్డ్​ తండ్రి మరణించాడన్న వార్త తెలియడంతో అతడు వెస్టిండీస్​కు తిరిగి వెళ్ళిపోతున్నాడు. ఈ విషయాన్ని సన్​రైజర్స్​ ప్రకటించింది. బెయిర్​ స్టో ఈ సీజన్​కు అందుబాటులో ఉండకపోవడంతో సన్​రైజర్స్​ రూథర్​ఫోర్డ్​తో ఒప్పందం చేసుకుంది. అదే సమయంలో నటరాజన్​ స్థానంలో జమ్మూ కశ్మీర్​ ప్లేయర్​ ఉమ్రాన్​ మాలిక్​ను జట్టులోకి తీసుకుంది.