వృద్ధాప్య సమస్యలతో నిన్న మరణించిన టాలీవుడ్ అగ్రనటుడు సూపర్ స్టార్ కృష్ణ అంతిమ యాత్ర ప్రారంభమైంది. కొద్ది సేపటి క్రితమే మహాప్రస్థానం చేరుకున్న ఆయన పార్ధీవ దేహానికి పూర్తిగా తెలంగాణ ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియలు జరగనున్నాయి. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమర్ ఆధ్వర్యంలో ఇప్పటికే ఏర్పాట్లు జరిపించారు. ఈరోజు ఉదయం ఆయన పార్ధీవ దేహాన్ని ప్రజల సందర్శనార్ధం పద్మాలయ స్టూడియో లో ఉంచి.. అనంతరం అక్కడి నుంచి మహా ప్రస్థానానికి తీసుకొచ్చారు.