భారత దేశం గర్వించదగ్గ నటుల్లో ఒకరు, అభిమానులకు అసలైన సూపర్ స్టార్ కృష్ణ అంత్యక్రియలు కొద్దిసేపటి క్రితం ముగిశాయి. మంగళవారం ఉదయం అనారోగ్య సమస్యలతో కన్నుమూసిన ఆయనకు ఈరోజు మహాప్రస్థానంలో ప్రభుత్వ అధికార లాంచనాలతో తుది వీడ్కోలు పలికారు. కృష్ణ పార్ధీవ దేహానికి పోలీసులు గౌరవ వందనం తెలిపి గాల్లోకి కాల్పులు జరిపారు. అంత్యక్రియల నేపధ్యంలో ఆయనను కడసారి చూసేందుకు మహాప్రస్థానం రోడ్డుకు ఇరువైపులా అభిమానులు బారులు తీరారు.